ప్రజాసేవకే ఈ జీవితం అంకితం
ఉండి సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి - బి. బలరాం వెల్లడి
ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తూ వాటి పరిష్కారానికి ప్రజలకు సేవ చేయడానికి ఈ జీవితాన్ని అంకితం చేస్తానని సిపిఎం సిపిఐ జనసేన బీఎస్పీ పార్టీలు బలపర్చిన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బి బలరం అన్నారు .స్థానిక ఎన్నికల పార్టీ కార్యాలయంలో సోమవారం జిల్లా కార్యవర్గ సభ్యులు GNV గోపాల్ అధ్యక్షతన సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో బలరాం మాట్లాడుతూ సొంత కుటుంబ సభ్యుడినిచూసుకున్నంత గా సూ సు కున్నంతగా తనను చూస్తున్నారని అన్నారు .గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజాసేవకే ఈ జీవితం అంకితం చేస్తానని తెలిపారు .టిడిపి వైసిపి ప్రజలను ప్రలోభాలకు గురి చేసే అని విమర్శించారు .పదుల పదుల కోట్లు ఖర్చుచేసి అని ఎద్దేవా చేశారు.వామపక్షాలు జనసేన బి ఎస్ పి బలపరిచిన అభ్యర్థి బలరాంకు బూత్ ఏజెంట్గాగా పని చేసిన వారిపై దాడులకు దౌర్జన్యాలకు బెదిరింపులకు టిడిపి వైసిపి పార్టీలు దిగటం తగదని హెచ్చరించారు .తాను ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయలేదని గుర్తు చేశారు .ప్రజా సమస్యలపైనే తన ఎన్నికల ప్రచారం జరిగిందని పేర్కొన్నారు .నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు .టీడీపీ వైసీపీ లు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు .ఇల్లు ఇళ్లస్థలాలు రైతులకు గిట్టుబాటు ధర ఆక్వా రైతులకు నాణ్యమైన సిడు పిడు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు .ఇలాంటి నాయకులకు ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.....