BREAKING

రాష్ట్రంలో దుర్మాగ్గ పాలన నడుస్తుంది .. అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు.. గవర్నర్ కు ఫిర్యాదు చేసిన వైయస్ జగన్ సంక్రాంతి సెలవులకు ఊళ్లకు వెళ్లే వారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం సేవలు వినియోగించండి-జిల్లా ఎస్పీ ఎం.రవి ప్రకాష్ విజ్ఞప్తి:

Tuesday 16 April 2019

ప్రజలు దుర్మాగ్గ పాలనకు అంతం పలికారు.

తాను గెలిస్తే సింధుకు నేనే బ్యాట్మింటన్ నేర్పించా.. 
తాను గెలిస్తే బిల్ గేట్స్ కు కంప్యూటర్ నేర్పించా 
తాను ఓడితే .. సింధుకు బ్యాట్మింటన్ నేర్పిన కోచ్ డి తప్పు 
తాను ఓడిపోతే బిల్ గేట్స్ కు కంప్యూటర్ నొక్కడం రాలేదు 
చంద్రబాబు పై జగన్ కామెంట్స్ 







అన్ని తనకు అనుకూలంగా ఉంటే అన్నిబాగున్నాయి .. లేదంటే అన్నీ తప్పులే ఇది చంద్రబాబు నైజం
2014 లో ఇవే ఈవీఎం మిషన్లు ఉన్నాయని, నాడు గెలుపు తనకు అనుకూలంగా ఉన్నందున నోరుమెదపలేదని జగన్ అన్నారు. అప్పుడు వివి ప్యాడ్ కూడా లేవని అయినా తాము ఏ కామెంట్స్ చేయలేదని జగన్ అన్నారు. సోమవారం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కు వైయస్ ఆర్సీపి అధ్యక్షుడు  వైయస్ జగన్ మ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈవీఎం లు ట్యాపరింగ్ జరిగాయని చంద్రబాబు   లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారని, తానూ ఎవరికీ ఓటు వేశానో తనకే తెలియదనడం సిగ్గుచేటని జగన్ అన్నారు. రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్ గడ్, కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ గెలిచించిందని,  బిజెపి ఓడిందని .. . అప్పుడు కూడా ఇవే ఈవీఎం లు ఉన్నాయని అప్పుడు బాబు ఎందుకు మాట్లాడలేదన్నారు. ఓటు వేసిన తరవాత వివిప్యాడ్ లో తాము ఎవరికీ ఓటు వేశామో తెలుస్తుందని ఆలా రాకపోతే ప్రజలు ఫిర్యాదులు చేశేవారని కానీ రాష్ట్రంలో ఆలా ఎవ్వరు ఫిర్యాదులు చేయలేదన్నారు.పోలింగ్ బూత్ లలో  పోలింగ్ కు ముందు అన్ని పార్టీల  ఏజెంట్లు కలసి 50 ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారని ఎవరికీ ఓటు వేస్తే ఎవరికీ పడుతుందో వివి ప్యాడ్ లో పరిశీలించి అన్ని కరెక్ట్ గా ఉంటే  ఏజెంట్స్ నుంచి సంతకాలు తీసుకొని పోలింగ్ ప్రారంభిస్తారని జగన్ అన్నారు.
 చంద్రబాబు నిజంగా మనిషేనా .. 
------------------------------------
తాను గెలిస్తే సింధుకు నేనే బ్యాట్మింటన్ నేర్పించా .. బిల్గెట్స్ కి కంప్యూటర్ నేనే నేర్పించా అంటాడు
ఓడిపోతే సింధు కు బ్యాట్మింటన్ నేర్పించిన కోచ్ డి తప్పు .. బిల్ గేట్స్ బటన్ సరిగా నొక్కలేదు .. అంటాడు. రాష్ట్రం లో దిగజారుతున్న లా అండ్ ఆర్డర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు జగన్.. రాష్ట్రంలో తనకు అనుకూలంగా ఉండే పోలీస్

మాజీ స్పీకర్  స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు  దౌర్జన్యం


--------------------------------------
మాజీ స్పీకర్ కోడెల సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లోకి వెళ్లి డోర్లు లాక్ చేసుకొని చొక్కాలు చింపుకొన్నారని అటువంటి వారిపై ఎటువంటి కేసులు పెట్టలేదని అన్నారు.. గురజాల గ్రామంలో వారికి అనుకూలంగా ఓట్లు వేయలేదని ముస్లిం,ఎస్సి ల పై దుర్జన్యం చేసిన కేసులు పెట్టలేదని, పూతలపట్టులో వైసీపీ అభ్యర్థి ని కొట్టారని, 40 మంది తమకు అనుకూలంగా ఉన్న డిఎస్పీ లను ఇష్టం వచ్చినట్లుగా అన్ని డిపార్ట్మెంట్లలో నియమించారని వారు ఇష్టం వచ్చినట్లు తెలుగుదేశం ప్రభుత్వానికి సపోర్టు చేస్తున్నారని, మచిలీపట్నం లో స్ట్రాంగ్ రూమ్ లనుంచి ఎలా బయటకు తీశారని జగన్ గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో డెమోక్రసీ కి భంగం వాటిల్లుతుందని జగన్ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అధర్మ పరిపాలనకు విసుగెత్తిన ప్రజలు చంద్రబాబు కు బై.. బై చెప్పారని జగన్ అన్నారు.